News March 21, 2024
NZB: గూడ్స్ రైల్లో పొగలు

నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఎండ తీవ్రతకు స్వల్పంగా నిప్పురాజుకొని పొగలు వచ్చాయి. బొగ్గును తరలిస్తున్న వ్యాగన్‌లో పొగలు రాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిజామాబాద్ స్టేషన్‌లో ఆపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Similar News
News January 13, 2026
నవీపేట్: గొంతుకోసిన చైనా మాంజా

చైనా మాంజా ఒక రైతు ప్రాణం మీదకు తెచ్చింది. నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన మణికాంత్ పొలం నుంచి గడ్డితో బైక్‌పై వస్తుండగా, చైనా మాంజా మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. నిషేధిత మాంజా వాడకం వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News January 13, 2026
నిజామాబాద్: రెండు బైక్‌లు ఢీ

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌కు చెందిన గంగారాం,ఎల్లయ్య గాయపడగా,108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News January 13, 2026
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ సమీక్ష

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సిపి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


