News February 23, 2025
NLG: నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో, SC, ST గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం NLGలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్‌లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Similar News
News January 19, 2026
NLG: బంకుల్లో వసూళ్లే.. వసతుల్లేవ్!

నల్గొండ జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరువయ్యాయి. డబ్బులు వసూలు చేస్తున్న యజమానులు కనీస సౌకర్యాలను విస్మరిస్తున్నారు. ఉచిత గాలి, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలన్న రూల్స్ తుంగలో తొక్కుతున్నారు. టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.. లేదంటే తాళాలు వేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కాలం చెల్లినవే. నాణ్యతను ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
News January 19, 2026
నేటి నుంచి సర్పంచులకు శిక్షణ.. పంచాయతీ పాలనపై అవగాహన

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.
News January 18, 2026
రద్దీ దృష్ట్యా రహదారులపై నిఘా: ఎస్పీ

సంక్రాంతి సెలవుల ముగింపుతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల కోసం జిల్లా పోలీసులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 450 మంది సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. టోల్ ప్లాజాలు, కూడళ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచామని, వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని కోరారు.


