News February 23, 2025

జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

image

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.

Similar News

News February 23, 2025

HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

image

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

News February 23, 2025

రేపు 3 జిల్లాల్లో సీఎం ప్రచారం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు నిజామాబాద్, మ.1.30 గం.కు మంచిర్యాల, సా.3.30 గంటలకు కరీంనగర్‌లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, జూపల్లి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.

News February 23, 2025

పార్వతీపురంలో చికెన్, ఎగ్ మేళా

image

జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి మన్మధరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పార్వతీపురంలో భాస్కర డిగ్రీ కళాశాల సమీపం(పెట్రోల్ బంకు)లోను, కొత్తవలస అమ్మవారి గుడి సమీపంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 కేజీల చికెన్, 2000 గుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

error: Content is protected !!