News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.
Similar News
News February 23, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24న తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.
News February 23, 2025
ADB: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
News February 23, 2025
ADB: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.