News February 23, 2025

ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

image

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.

Similar News

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.

News November 6, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.

News November 6, 2025

వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.