News February 23, 2025

జనగామ: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

image

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 23, 2025

విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

image

పాకిస్థాన్‌తో మ్యాచులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు. వన్డేల్లో ఇది ఆయనకు 51వ సెంచరీ. ఇవాళ్టి మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు.

News February 23, 2025

INDvsPAK మ్యాచుకు హార్దిక్ గర్ల్‌ ఫ్రెండ్?

image

నటాషాతో విడాకుల తర్వాత భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచుకు ఆమె హాజరవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అక్షర్ పటేల్ భార్య పక్కనే ఆమె కూర్చొని భారత జట్టుకు మద్దతు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం నిజమేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News February 23, 2025

బాలానగర్‌‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

image

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!