News February 23, 2025
పనికి జస్టిఫై చేయాలి.. లేదంటే ఉద్యోగాల కోత: మస్క్

US అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫెడరల్ సిబ్బంది తమ పనికి జస్టిఫై చేయాలి. లేదంటే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఏం చేశారో ప్రతి సోమవారం రా.11.59లోపు నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ప్రకటనను ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ ఖండించారు. చట్టవిరుద్ధమైన తొలగింపులను కోర్టులో సవాల్ చేస్తాన్నారు.
Similar News
News February 23, 2025
MOST RUNS: పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులు కొల్లగొడుతున్నారు. PAKపై అద్భుత ఇన్నింగ్సుతో మరో రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ (27483)ను అధిగమించారు. సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లీ (27484) టాప్-3లో ఉన్నారు.
News February 23, 2025
అధ్యక్ష పదవిని వదులుకోవడానికి సిద్ధం: జెలెన్స్కీ

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనడం కోసం అధ్యక్ష పదవిని వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. శాంతి నెలకొల్పినా లేదా నాటో స్యభ్యత్వం ఇచ్చినా ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దేశ భద్రతే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగాలనేది తన కల కాదని పేర్కొన్నారు. తమ దేశానికి US భద్రతా హామీలు ఇవ్వాలని కోరారు.
News February 23, 2025
రేపు పవన్ సినిమా నుంచి సాంగ్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. రేపు ఈ సినిమా నుంచి ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. రేపు మ.3 గంటలకు ఈ పాట విడుదలవుతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. పవన్, నిధి అగర్వాల్ మధ్య ఈ సాంగ్ నడవనున్నట్లు తెలుస్తోంది. మార్చి 28న ఈ సినిమా పార్ట్-1 విడుదల కానుంది.