News February 23, 2025
ప్రశ్నించేందుకే అసెంబ్లీకి జగన్: వైవీ సుబ్బారెడ్డి

AP: ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని YCP నేత YV సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. YCP నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు భద్రత కల్పించకపోవడం దారుణం. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న శంకర్ తనయుడు!

తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ నిర్మాణంలో అశోక్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అర్జిత్ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
News September 18, 2025
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లు తగ్గింపు

వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి వడ్డీరేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీరేట్లు 4 శాతం నుంచి 4.5 శాతం రేంజ్‌కు చేరాయి. ద్రవ్యోల్భణం పెరుగుతున్నా.. జాబ్ మార్కెట్ మందగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.