News March 21, 2024
లక్కిరెడ్డిపల్లి: బావిలో దూకి ఆత్మహత్య

లక్కిరెడ్డిపల్లె మండలంలోని కస్తూరురాజుగారిపల్లి కస్పాకు చెందిన వంటేరు లక్ష్మీదేవి(27) గురువారం తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం కొరకు లక్ష్మీదేవి మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 9, 2025
ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
News April 9, 2025
చివరికి న్యాయమే గెలిచింది: మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా

చివరికి న్యాయమే గెలిచిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. తన సోదరుడు అంజద్ బాషా కడపలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా అంజాద్ అంజద్ బాషా మాట్లాడారు. చివరి వరకు న్యాయస్థానాన్ని నమ్మామన్నారు. న్యాయమే గెలిచి నా సోదరుడు అహ్మద్ అంజద్ బాషాకి బెయిల్ వచ్చిందన్నారు. కష్టకాలంలో తోడున్న వైసీపీ కార్యకర్తలకి, ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
News April 9, 2025
సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్‌లో శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవ విధుల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు.