News February 23, 2025

NZB: యువతిపై సామూహిక అత్యాచారం

image

ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలితో ఉన్న మరో యువతి ఘటనాస్థలి నుంచి పారిపోయి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను NZB నుంచి కారులో తెచ్చారని, మద్యం మత్తులో ఉన్నారని సమాచారం.

Similar News

News November 8, 2025

NZB: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో ఫిర్యాదు

image

NZB CCS కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. అది కస్టోడియల్ డెత్ అని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC), జాతీయ మహిళా కమిషన్(NCW), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)కు ఫిర్యాదు చేశారు. దీనిపై CBIతో విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నేతలతో కలసి రియాజ్ తల్లి జరీనా బేగం, భార్య సనోబర్ నజ్జీన్ వినతిపత్రాలు అందజేశారు.

News November 8, 2025

వేములవాడలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దేవాలయం వెళ్లాలన్నా, ఇంట్లో పూజ చేయాలన్నా కొబ్బరికాయ తప్పనిసరి కావడంతో, భక్తుల సెంటిమెంట్‌ను దుకాణదారులు ఆసరాగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కొబ్బరికాయను సాధారణ కిరాణా దుకాణాల్లో సైతం రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు.

News November 8, 2025

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in