News February 23, 2025
ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి: బెల్లంపల్లి ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
Similar News
News February 23, 2025
విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

పాకిస్థాన్‌తో మ్యాచులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు. వన్డేల్లో ఇది ఆయనకు 51వ సెంచరీ. ఇవాళ్టి మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు.
News February 23, 2025
INDvsPAK మ్యాచుకు హార్దిక్ గర్ల్ ఫ్రెండ్?

నటాషాతో విడాకుల తర్వాత భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచుకు ఆమె హాజరవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అక్షర్ పటేల్ భార్య పక్కనే ఆమె కూర్చొని భారత జట్టుకు మద్దతు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం నిజమేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 23, 2025
బాలానగర్‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.