News March 21, 2024
మండపేట MLA అభ్యర్థిగా దివ్యాంగుడు

డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లా మండపేట నియోజకవర్గ MLA అభ్యర్థిగా ‘నవతరం పార్టీ’ నుంచి దివ్యాంగుడు నందికోళ్ల రాజు బరిలో ఉన్నారు. కాగా ఆయన గురువారం మండలంలోని తాపేశ్వరం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేశాయో యువత గమనించాలన్నారు.
Similar News
News December 13, 2025
తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 12, 2025
తూ.గో: షార్ట్ ఫిలిం తీసేందుకు పోలీసుల ఆహ్వానం

వివిధ విభాగాలలో షార్ట్ ఫిలిం తీసే ఔత్సాహికులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆహ్వానం పలుకుతున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు నాలుగు విభాగాలపై షార్ట్ ఫిలిం తీయనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్‌నెస్‌పై దరఖాస్తులు ఆహ్వానించారు. విజేతలకు రూ.10 వేలు నగదు అందజేస్తారు. డిసెంబర్ 25లోగా పంపాలని, 6 నిమిషాల నిడివి ఉండాలన్నారు.


