News February 23, 2025

పెద్దపల్లి: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

పెద్దపల్లి కలెక్టరేట్లో ఫిబ్రవరి 24న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 23, 2026

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ పొడగింపు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో సీసీఐ ద్వారా కొనసాగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియ గడువును పొడిగించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పత్తి సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ వద్ద ఉన్న దిగుబడిని ఈ నెల 27లోపు సమీప కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 23, 2026

తొలిరోజు 635 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

అనంతపురం జిల్లాలోని 64 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. జిల్లాలో 22,848 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 22,213 మంది రాశారని చెప్పారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు.

News February 23, 2026

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు: CM

image

AP: రాజమండ్రి కల్తీ పాల <<19215623>>ఘటన<<>> బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. పాల వ్యాపారి గణేశ్వరరావును అరెస్ట్ చేశామని, బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు.