News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

image

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16వేల కుటుంబాలకు కార్డులు ఇవ్వగా, మార్చి 1న ఎన్నికల కోడ్ లేని HYD, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనుంది. MAR 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ చేయనున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3సార్లు దరఖాస్తులు చేయగా, అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలిస్తున్నారు.

Similar News

News February 23, 2025

ఆ రోజే ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’?

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అదే రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కన్నడ <<15474976>>‘మ్యాక్స్’<<>> కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే ZEE5లోకి వచ్చేసింది. ఇదే పంథాను OTT సంస్థ కొనసాగిస్తుందని సమాచారం. కాగా థియేటర్లలో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

News February 23, 2025

విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

image

పాకిస్థాన్‌తో మ్యాచులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదారు. వన్డేల్లో ఇది ఆయనకు 51వ సెంచరీ. ఇవాళ్టి మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు.

News February 23, 2025

INDvsPAK మ్యాచుకు హార్దిక్ గర్ల్‌ ఫ్రెండ్?

image

నటాషాతో విడాకుల తర్వాత భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచుకు ఆమె హాజరవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అక్షర్ పటేల్ భార్య పక్కనే ఆమె కూర్చొని భారత జట్టుకు మద్దతు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం నిజమేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!