News February 23, 2025

BJP అభ్యర్థులను గెలిపించండి: కిషన్ రెడ్డి

image

TG: ఈ నెల 27న జరిగే పట్టభద్రులు, టీచర్స్ MLC ఎన్నికల్లో BJP అభ్యర్థులను గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్‌లో ప్రముఖులు, మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ‘KCRను గద్దె దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది. కాంగ్రెస్‌కు 14 నెలల్లోనే ఈ పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే పరిస్థితి ఉంది. గాల్లో దీపంలా వారి హామీలు మారాయి. అభయహస్తం మొండిహస్తంగా మారింది’ అని ఎద్దేవా చేశారు.

Similar News

News November 12, 2025

రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు: PCC చీఫ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందన్న BRS ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ‘రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. BRS వాళ్లు ఓడిపోతున్నామనే బాధలో మాట్లాడుతున్నారు. మళ్లీ మేమే వస్తాం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News November 12, 2025

కొబ్బరి చెట్లకు నీటిని ఇలా అందిస్తే మేలు

image

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.

News November 12, 2025

‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

image

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.