News February 23, 2025
IND vs PAK: టాస్ ఓడిన భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. IND: రోహిత్ (C), గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, కుల్దీప్, హర్షిత్.
PAK: రిజ్వాన్ (C), బాబర్, ఇమాముల్, షకీల్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రీదీ, నషీమ్ షా, హ్యారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
Similar News
News February 24, 2025
రోహిత్ శర్మ రికార్డు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా ఆయన నిలిచారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో పరుగుల ఖాతా తెరిచి ఈ మైలురాయి చేరుకున్నారు. 181 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సచిన్(197), గంగూలీ(231), గేల్(246), గిల్ క్రిస్ట్(253), జయసూర్య(268) ఉన్నారు.
News February 24, 2025
భారత జట్టుకు ప్రముఖుల విషెస్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని AP CM చంద్రబాబు అన్నారు. జట్టుకు TG CM రేవంత్ కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 24, 2025
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మాన్, ఒలివర్

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్, అతని పార్ట్‌నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్‌మాన్ 2024లో ఒలివర్‌ను వివాహమాడారు.