News February 23, 2025

జగిత్యాల: చివరి దశకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. 25తో ప్రచారం ముగుస్తుండగా.. జిల్లాలో ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా పట్టభద్రులను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర అభ్యర్థులు సైతం ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ముందుగానే జీవన్ రెడ్డి గెలుపుపై వచ్చిన క్లారిటీ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థికి రావడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

Similar News

News February 24, 2025

భారత జట్టుకు ప్రముఖుల విషెస్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని AP CM చంద్రబాబు అన్నారు. జట్టుకు TG CM రేవంత్ కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 24, 2025

మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మాన్, ఒలివర్

image

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్, అతని పార్ట్‌నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్‌మాన్ 2024లో ఒలివర్‌ను వివాహమాడారు.

News February 24, 2025

పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

image

@ పెద్దపల్లి జిల్లాలో యూరియా ఉంది, ఆందోళన వద్దు: DAO @ మల్లన్న స్వామి పట్నాలకు హాజరైన ఎమ్మెల్యే విజ్జన్న @ పెద్దపల్లి: రూ.1000కే 3 పట్టు చీరలు.. ట్రాఫిక్ జామ్ @ పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు @ జిల్లా వ్యాప్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @ బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ తాపత్రయం: మంత్రి శ్రీధర్ బాబు.

error: Content is protected !!