News February 23, 2025
రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు. చంద్రగిరి అభివృద్ధిపై ఆరా తీశారు.
Similar News
News February 24, 2025
చనిపోయిన 5 నెలలకు హెజ్బొల్లా మాజీ చీఫ్ అంత్యక్రియలు

హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అంత్యక్రియలు లెబనాన్ రాజధాని బీరూట్‌లో ముగిశాయి. గతేడాది SEPలో ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించారు. అనంతరం నస్రల్లా వారసుడిగా హెజ్బొల్లా పగ్గాలు చేపట్టిన సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. వీరిద్దరి అంత్యక్రియలు అప్పట్లోనే తాత్కాలికంగా నిర్వహించారు. తాజాగా అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియలకు 65దేశాల నుంచి 800మంది ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.
News February 24, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
News February 24, 2025
పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.