News February 23, 2025

టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

image

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.

Similar News

News November 11, 2025

ఇంజినీర్ పోస్టులకు RITES నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్( <>RITES<<>>) 7 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC,ST, PWBDలకు రూ.300. వెబ్‌సైట్: http://www.rites.com

News November 11, 2025

రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్‌ AMG G63 వ్యాగన్‌ మోడల్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్‌తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.

News November 11, 2025

ఇంటి బేస్‌మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

image

ఇంటి బేస్‌మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్‌మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>