News March 21, 2024

కర్నూలు జిల్లాలో TDP ఒక్కసారి మాత్రమే గెలిచిన స్థానం ఇదే..

image

కోడుమూరు నియోజవకర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో TDP ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1962లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పీఆర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి డీ.సంజీవయ్య విజయం సాధించారు. మొత్తం 8సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 1983లో తొలిసారి బరిలో నిలిచిన TDP పరాజయం పాలైంది. 1985లో TDP అభ్యర్థి ఎం.శిఖామణి మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.

Similar News

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.