News February 23, 2025
మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 24, 2025
MNCLజిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 27న జరగనున్న పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
News February 24, 2025
చనిపోయిన 5 నెలలకు హెజ్బొల్లా మాజీ చీఫ్ అంత్యక్రియలు

హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అంత్యక్రియలు లెబనాన్ రాజధాని బీరూట్‌లో ముగిశాయి. గతేడాది SEPలో ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించారు. అనంతరం నస్రల్లా వారసుడిగా హెజ్బొల్లా పగ్గాలు చేపట్టిన సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. వీరిద్దరి అంత్యక్రియలు అప్పట్లోనే తాత్కాలికంగా నిర్వహించారు. తాజాగా అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియలకు 65దేశాల నుంచి 800మంది ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.