News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
Similar News
News January 26, 2026
మెదక్: ‘న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్ధకత’

ప్రతి బాధితుడికి న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్థకత అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలన్నారు. మెదక్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగప్రాయంగా అర్పించిన ఫలితంగా మనకు భారత రాజ్యాంగం లభించిందని తెలిపారు.
News January 26, 2026
చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.
News January 25, 2026
పటాన్చెరులో యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

పటాన్చెరు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ముత్తంగి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


