News February 23, 2025
ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
Similar News
News February 24, 2025
హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

పాక్‌తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.
News February 24, 2025
అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా?

అలారం పెట్టుకొని నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఇది హార్ట్ బీట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్వాస ఆడకపోవడం, ఆందోళన, తలనొప్పి రావొచ్చని పేర్కొంది. వీలైతే న్యాచురల్‌గా నిద్ర లేవడం, అలారం సౌండ్ తక్కువగా పెట్టుకోవడం చేయాలని సూచించింది.
News February 24, 2025
ఉప్పల్: పదవ తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదవ తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజనీరింగ్ విద్యను డిప్లమా లెవెల్లో అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందు కోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచి విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.