News February 23, 2025
TGలో మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్

TG: మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ కంపెనీలు, బీర్ సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి ఎక్సైజ్ శాఖ అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని కోరుతూ నాణ్యత, ప్రమాణాలపై కంపెనీల నుంచి సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోవాలని నిర్ణయించింది.
Similar News
News February 24, 2025
అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా?

అలారం పెట్టుకొని నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఇది హార్ట్ బీట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్వాస ఆడకపోవడం, ఆందోళన, తలనొప్పి రావొచ్చని పేర్కొంది. వీలైతే న్యాచురల్‌గా నిద్ర లేవడం, అలారం సౌండ్ తక్కువగా పెట్టుకోవడం చేయాలని సూచించింది.
News February 24, 2025
ఆపరేషన్ SLBC: రెండు ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు

TG: శనివారం ఉదయం SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటికి రాలేదు. వారిని తీసుకొచ్చేందుకు NDRF, నేవీ ప్రయత్నిస్తున్నాయి. అయితే బురద వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాన్-ఎ, ప్లాన్-బి రూపొందించాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం. ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఆ 8మంది సురక్షితంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు.
News February 24, 2025
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

* 1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం
* 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం
* 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం
* 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం
* 2018- అతిలోక సుందరి శ్రీదేవి మరణం(ఫొటోలో)
* 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు(ఫొటోలో)