News February 23, 2025
WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.
Similar News
News February 24, 2025
పాకిస్థాన్‌పై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్

CTలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ వేసిన ట్వీట్ అదిరిపోయింది. ‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’ అంటూ సెటైర్లు వేసింది. ఇక ఓటమి నేపథ్యంలో పాక్‌లో టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
News February 24, 2025
NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉంది. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.45 గంటలకు నిజామాబాద్ లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. అక్కడ 1.30 వరకు మీటింగ్‌లో పాల్గొని మంచిర్యాల బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి 4.20కి కరీంనగర్ చేరుకుని అక్కడ మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం 6.45కు బేగంపేట చేరుతారు.
News February 24, 2025
నేడు కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గెలుపు కోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ సభకు కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ పిలుపునిచ్చారు. పట్టుభద్ధులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.