News February 23, 2025
పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News February 24, 2025
పాకిస్థాన్‌పై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్

CTలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ వేసిన ట్వీట్ అదిరిపోయింది. ‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’ అంటూ సెటైర్లు వేసింది. ఇక ఓటమి నేపథ్యంలో పాక్‌లో టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
News February 24, 2025
హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

పాక్‌తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.
News February 24, 2025
అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా?

అలారం పెట్టుకొని నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఇది హార్ట్ బీట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్వాస ఆడకపోవడం, ఆందోళన, తలనొప్పి రావొచ్చని పేర్కొంది. వీలైతే న్యాచురల్‌గా నిద్ర లేవడం, అలారం సౌండ్ తక్కువగా పెట్టుకోవడం చేయాలని సూచించింది.