News February 23, 2025
కర్నూలు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

కర్నూలు జిల్లాలో 30 కేంద్రాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఉదయం పేపర్-1 పరీక్షలకు 9,993 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 8,693 మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలకు 9,993 మంది హాజరు కావాల్సి ఉండగా 8,678 మంది హాజరయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
Similar News
News February 24, 2025
ఆనందంగా ఉంది: కోహ్లీ

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.
News February 24, 2025
సంగారెడ్డి: 1.08 కోట్ల రుద్రాక్షలు.. 18.06 అడుగుల శివలింగం

సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 1.08 కోట్ల రుద్రాక్షలతో తయారు చేసిన 18.06 అడుగుల శివలింగాన్ని ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యేక పూజలు చేసి కోటి రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. 26న మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
News February 24, 2025
నర్సింహులపేట: జ్యోతిష్యం పేరుతో మోసం!

జ్యోతిష్యం పేరుతో బాబా వేషంలో వచ్చిన వ్యక్తులు బంగారం కాజేసిన ఘటన పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సముద్రాల శోభ ఇంటికి ఇద్దరు బాబా వేషాధరణలో వచ్చిన వ్యక్తులు, మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా అంటూ మాటలు కలుపుతూ శోభపై మొత్తం ముందు చల్లారు. శోభ ధరించిన బంగారాన్ని కాజేశారు. ఫోటో ఆధారంగా శోభ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.