News February 23, 2025
హనుమకొండ: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 24, 2025
సిర్పూర్ టీ: భీమన్న గుడి వద్ద మృతదేహం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
News February 24, 2025
ADB: త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి..!

FEB 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 9-12 వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఇన్నోవేషన్స్ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కు FEB 23 చివరి రోజు అని డీఈఓ ప్రణీత తెలిపారు. FEB 27, 28 తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. గెలుపొందిన వారికి FEB 28న రాష్ట్రపతి భవనంలో బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.