News February 23, 2025
గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే మ్యాచ్ చూస్తావా?: వైసీపీ

AP: INDvsPAK క్రికెట్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లిన మంత్రి <<15555923>>లోకేశ్‌పై<<>> YCP మండిపడింది. ‘ఇటు రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్‌లో మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది’ అని X వేదికగా విమర్శించింది.
Similar News
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<