News February 23, 2025
పార్వతీపురంలో చికెన్, ఎగ్ మేళా

జిల్లాలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధక అధికారి మన్మధరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పార్వతీపురంలో భాస్కర డిగ్రీ కళాశాల సమీపం(పెట్రోల్ బంకు)లోను, కొత్తవలస అమ్మవారి గుడి సమీపంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 కేజీల చికెన్, 2000 గుడ్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
Similar News
News February 24, 2025
రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలవరు: బండి

కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. MLC ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందని, ఏ సర్వే చూసినా విజయం BJPదేనని తేల్చడంతో కంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఎన్నికల్లో దిగి పైసలు పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. రేవంత్ కాదు కదా…రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా MLC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు.
News February 24, 2025
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్న శివుడి ఆశీస్సులు భక్తులు పొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
News February 24, 2025
NZB: కాంగ్రెస్‌కు షాక్.. అభ్యర్థిని ఓడించడమే ధ్యేయమన్న గంగాధర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసి అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మధనం గంగాధర్ సీఎం పర్యటనకు ముందు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంధర్ రెడ్డిని ఓడించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.