News February 23, 2025

ఆ సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యా: ఆమిర్ ఖాన్

image

లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం తనను ఎంతో బాధించిందని ఆమీర్ ఖాన్ అన్నారు. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు లోనైనట్లు తెలిపారు. తన చిత్రాలు సరిగ్గా ఆడకపోతే రెండు, మూడు వారాలు డిప్రెషన్‌లో ఉంటానని అనంతరం సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు టీంతో కలిసి చర్చిస్తానని ఆమిర్ పేర్కొన్నారు. 2022లో ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Similar News

News February 24, 2025

యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన ఆదిలాబాద్ విద్యార్థిని

image

యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ చరిత్ర సబ్జెక్ట్‌లో జిల్లాకు చెందిన విద్యార్థిని అర్హత సాధించింది. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థిని ముండే రుమాతాయి ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది. పీజీ చదువుతూనే యూజీసీ నెట్ అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రఘుతో పాటు సిబ్బంది అభినందించారు.

News February 24, 2025

ఆనందంగా ఉంది: కోహ్లీ

image

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.

News February 24, 2025

పాకిస్థాన్‌పై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్

image

CTలో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ వేసిన ట్వీట్ అదిరిపోయింది. ‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’ అంటూ సెటైర్లు వేసింది. ఇక ఓటమి నేపథ్యంలో పాక్‌లో టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

error: Content is protected !!