News February 23, 2025
న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. మళ్లింపు

అమెరికాలోని న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AA292ను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. తుర్కియే వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News January 1, 2026
కాఫ్ సిరప్ తయారీ, విక్రయ నిబంధనలు కఠినం

‘కోల్డ్రిఫ్’ కాఫ్ సిరప్‌తో MP, రాజస్థాన్‌లలో పిల్లలు మరణించడం తెలిసిందే. దీనిపై WHO హెచ్చరికతో కేంద్రం సిరప్‌ల తయారీ, విక్రయ రూల్స్ కఠినం చేస్తోంది. సిరప్ పదాన్ని షెడ్యూల్ K నుంచి తొలగించింది. కాస్మొటిక్స్‌తో పాటు కాఫ్ సిరప్‌ల తయారీ, విక్రయాలకు ఈ షెడ్యూల్ రూల్స్ వర్తించేవి. ఇకపై ఇతర డ్రగ్స్ కేటగిరీలోకి ఇవి చేరనున్నాయి. ప్రిస్క్రిప్షన్‌పైనే విక్రయించాలని కేంద్రం స్పష్టం చేసింది.
News January 1, 2026
USలో మూతపడనున్న NASA అతిపెద్ద లైబ్రరీ

US మేరీల్యాండ్‌లోని గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఉన్న నాసా అతిపెద్ద లైబ్రరీ రేపు మూతపడనుంది. కాస్ట్ కటింగ్ పేరిట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన రీఆర్గనైజేషన్ ప్లాన్‌లో భాగంగా దీనిని శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నారు. 1959లో స్థాపించిన ఈ లైబ్రరీలో లక్షకుపైగా బుక్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1.270 ఎకరాల్లోని క్యాంపస్‌లో 13 బిల్డింగ్స్, 100కుపైగా సైన్స్ & ఇంజినీరింగ్ ల్యాబ్స్ మూతపడనున్నాయి.
News January 1, 2026
మెట్ల కింద స్నానాల గది ఉండవచ్చా?

మెట్ల కింద స్నానాల గది నిర్మించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు పాదాల కింద పవిత్రత లేని ప్రదేశం ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘మెట్ల కింద స్థలం చాలా ఇరుకుగా ఉండి, పైకప్పు తలకి తగిలే ప్రమాదం ఉంటుంది. గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించవు. అనారోగ్య సమస్యలు రావొచ్చు. మురుగునీటి పైపుల నిర్వహణ కష్టమవుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


