News February 23, 2025
బాలానగర్‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 24, 2025
IND vs PAK మ్యాచ్@ 60 కోట్ల వ్యూస్

CT-2025లో భాగంగా భారత్, పాక్ మధ్య నిన్న జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ వ్యూస్ పరంగా నంబర్-1గా నిలిచింది. జియోహాట్‌స్టార్‌లో దాయాదుల పోరుకు 60.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో 6.8కోట్లు ఉన్న వ్యూస్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మ్యాచ్‌ను గెలిపించే సమయానికి 60.5కోట్లకు చేరి రికార్డ్ సృష్టించింది. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్‌కూ ఇన్ని వ్యూస్ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
News February 24, 2025
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
News February 24, 2025
జర్మనీ ఎన్నికల్లో సంచలనం

నిన్న జరిగిన దేశ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ CDU చీఫ్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. CDU/CSU కూటమి ఘన విజయం సాధించనుందని ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లు దక్కించుకోనుంది. 20.7% ఓట్లతో AfD రెండో స్థానంలో నిలవగా అధికార SPD 16.5% ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది.