News February 23, 2025

అసెంబ్లీలో వైసీపీ భాష వాడొద్దు: పవన్

image

AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామన్నారు. ప్రజాగొంతును అసెంబ్లీలో వినిపిద్దామని, సభ్యులు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని సూచించారు. వాడే భాష హుందాగా ఉండాలని, వైసీపీ భాష వాడవద్దని హితవు పలికారు.

Similar News

News February 24, 2025

జర్మనీ ఎన్నికల్లో సంచలనం

image

నిన్న జరిగిన దేశ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ CDU చీఫ్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. CDU/CSU కూటమి ఘన విజయం సాధించనుందని ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్‌ తెలిపాయి. కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లు దక్కించుకోనుంది. 20.7% ఓట్లతో AfD రెండో స్థానంలో నిలవగా అధికార SPD 16.5% ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది.

News February 24, 2025

టాప్‌లో భారత్.. లాస్ట్‌లో పాక్

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్‌లో భారత్ టాప్ ప్లేస్‌కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో రెండో స్థానంలో, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఇక కివీస్, భారత్ చేతిలో ఓడిన పాక్ 0 పాయింట్ల(NRR -1.087)తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లీగ్ దశ ముగిసేలోపు టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ వెళ్తాయి.

News February 24, 2025

ఆనందంగా ఉంది: కోహ్లీ

image

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.

error: Content is protected !!