News March 21, 2024
‘రజాకార్’ నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్రం

TG: ‘రజాకార్’ నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్రం భద్రత కల్పించింది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వర్గాల ద్వారా కేంద్రం దర్యాప్తు చేసి నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అఘాయిత్యాలపై తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ ఈ నెల 15న థియేటర్లలో విడుదలైంది.
Similar News
News April 6, 2025
పదేళ్ల అభివృద్ధిని దెబ్బతీశారు: హరీశ్‌రావు

TG: పదేళ్లుగా తాము చేసిన అభివృద్ధిని ఏడాదిలోనే కాంగ్రెస్ దెబ్బతీసిందని BRS నేత హరీశ్‌రావు ఆరోపించారు. తమ హయాంలో వార్షిక వృద్ధిరేటు 25.62%గా ఉందని, కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో ఏడాదిలోనే 1.93% తగ్గుదల నమోదైందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చి, మూసీ రివర్ ఫ్రంట్ అంటూ బుల్డోజర్లు ఎక్కించారని, మెట్రోలైన్ ప్రణాళికల్లో మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకున్నారని మండిపడ్డారు.
News April 6, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సుంకాల నుంచి ఆక్వాకు మినహాయింపు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర GDPలో మత్స్యరంగానిది కీలక పాత్ర. అమెరికా భారత్‌పై 27% సుంకం విధించింది. ఈక్వెడార్‌పై USA 10% సుంకమే విధించింది. ఇది మనకూ నష్టమే. ఏపీలో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. USAతో చర్చించండి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.
News April 6, 2025
ఎల్లుండి ఓదెల-2 ట్రైలర్

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఓదెల-2’ ట్రైలర్‌ను ఈ నెల 8న మ.3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముంబైలోని ఐకానిక్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.