News February 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

➤ గ్రామాల వారీగా పాదయాత్ర: తోపుదుర్తి
➤ ధర్మవరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
➤ చిల్లవారిపల్లి గ్రామస్థులకు డీఎస్పీ హెచ్చరిక
➤ డీహైడ్రేషన్‌తో లేపాక్షి యువకుడి మృతి
➤ పరిగి మండలంలో వైసీపీకి షాక్
➤ సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన
➤ చెన్నేకొత్తపల్లిలో విషాదం.. చిన్నారి మృతి
➤ అనంతపురం: 6,463 మంది పరీక్షలు రాశారు
➤ బత్తలపల్లి: తంబాపురంలో అగ్ని ప్రమాదం
Similar News
News February 24, 2025
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
News February 24, 2025
జర్మనీ ఎన్నికల్లో సంచలనం

నిన్న జరిగిన దేశ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ CDU చీఫ్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. CDU/CSU కూటమి ఘన విజయం సాధించనుందని ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లు దక్కించుకోనుంది. 20.7% ఓట్లతో AfD రెండో స్థానంలో నిలవగా అధికార SPD 16.5% ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
News February 24, 2025
నర్సాపూర్: ముగిసిన ఈ-బగ్గీల పోటీలు

బగ్గీల పోటీలను దక్షిణ భారతదేశంలో 2వ సారి నిర్వహించినందుకు గర్వంగా ఉందని BVRIT యాజమాన్యం తెలిపారు. నర్సాపూర్ సమీపంలోని BVRIT కళాశాల ఆవరణలో నిర్వహించిన బగ్గీల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారాలను ఆయా ప్రముఖుల చేత విజేతలకు అందజేశారు. ప్రముఖులు బగ్గీల విశిష్టత, పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం తీరు, విలువలను వివరించారు.