News February 24, 2025
వికారాబాద్ జిల్లాలో” SUNDAY TOP NEWS”

√ తాండూరు: భద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం. బొంరాస్‌పేట:Way2News కథనానికి స్పందన.√ మహా కుంభమేళాకు హాజరైన పరిగి మాజీ ఎమ్మెల్యే.√ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు.√ బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో జిల్లాలో పెరిగిన ఎఫెక్ట్ పెద్దెముల్: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.√ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష.
Similar News
News March 8, 2026
తిరుపతిలో భారీగా నకిలీ మద్యం.. వాస్తవం ఇదే!

తిరుపతిలో భారీగా నకిలీ మద్యం లభ్యం అంటూ SMలో వస్తున్న వార్తలపై FACT CHECK స్పందించింది. ‘తిరుపతి రూరల్ పాడిపేట ఇందిరమ్మ గృహాల వద్ద చంద్రగిరి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగేష్ రెడ్డి(38) నివాసంలో 34 లీటర్ల అనధికార మద్యం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి కెమికల్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు’. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News March 8, 2026
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 8, 2026
పోలవరం: అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు చుక్కెదురైంది. ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ల నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.


