News February 24, 2025
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మాన్, ఒలివర్

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్, అతని పార్ట్‌నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్‌మాన్ 2024లో ఒలివర్‌ను వివాహమాడారు.
Similar News
News February 24, 2025
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
News February 24, 2025
జర్మనీ ఎన్నికల్లో సంచలనం

నిన్న జరిగిన దేశ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ CDU చీఫ్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. CDU/CSU కూటమి ఘన విజయం సాధించనుందని ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లు దక్కించుకోనుంది. 20.7% ఓట్లతో AfD రెండో స్థానంలో నిలవగా అధికార SPD 16.5% ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
News February 24, 2025
టాప్‌లో భారత్.. లాస్ట్‌లో పాక్

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ పాయింట్ల టేబుల్‌లో భారత్ టాప్ ప్లేస్‌కి చేరింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో రెండో స్థానంలో, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. ఇక కివీస్, భారత్ చేతిలో ఓడిన పాక్ 0 పాయింట్ల(NRR -1.087)తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. లీగ్ దశ ముగిసేలోపు టాప్-2లో ఉన్న జట్లు సెమీస్ వెళ్తాయి.