News February 24, 2025
రోహిత్ శర్మ రికార్డు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా ఆయన నిలిచారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో పరుగుల ఖాతా తెరిచి ఈ మైలురాయి చేరుకున్నారు. 181 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సచిన్(197), గంగూలీ(231), గేల్(246), గిల్ క్రిస్ట్(253), జయసూర్య(268) ఉన్నారు.
Similar News
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.


