News February 24, 2025
నేటి ముఖ్యాంశాలు

* అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ
* భయంకరంగా శ్రీశైలం టన్నెల్ ప్రమాద తీవ్రత: మంత్రి జూపల్లి
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నానే: కిషన్ రెడ్డి
* AP: జగన్ 2 దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి సుభాష్
* ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు పూర్తి
* పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
Similar News
News February 24, 2025
‘స్పెషల్ కోచ్’ వచ్చినా.. పాక్ కథ మారలేదు!

భారత్‌పై గెలవడానికి స్పెషల్ కోచ్‌ను నియమించుకున్నా పాక్ కథ మారలేదు. రెగ్యులర్ కోచ్ అకిబ్ జావెద్‌ను కాదని మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్‌ను నియమించుకొని ఆ జట్టు వ్యూహాలు రచించింది. సాధారణంగా పేస్ దళంతో బలంగా కనిపించే పాక్ నిన్నటి మ్యాచ్‌లో బంతితోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. స్పెషల్ కోచ్ ఇచ్చిన సూచనలు వర్కౌట్ కాలేదో? లేక హై ఓల్టేజ్ కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిందో? తెలియదు కానీ ఘోరంగా ఓడింది.
News February 24, 2025
రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

AP: ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ MD కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.
News February 24, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త

AP: వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కన్పిస్తోంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5°C నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని, అందుకు తగ్గట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.