News February 24, 2025

నేడు భద్రాచలంలో గిరిజన దర్బార్‌: ITDA PO

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

గన్నవరం ఎయిర్‌పోర్టు బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి?

image

గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి బోర్డు సభ్యుల నియామకంపై స్థానిక MLA యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను సంప్రదించకుండా పదవులు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైస్ ఛైర్మన్ హోదాలో ఉన్నా ఇటీవల జరిగిన బోర్డు సమావేశానికి ఆయన హాజరు కాలేదు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి పదవిని ఇచ్చారని, అతడిని తొలగించాలని కేంద్రమంత్రికి MLA లేఖ రాసినట్లు సమాచారం.

News September 14, 2025

శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.

News September 14, 2025

ఏలూరు: సెప్టెంబర్ 16న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

image

ఏలూరు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి సెప్టెంబర్ 16న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కాంపౌండ్‌లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. NCS నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లమో ఉత్తీర్ణత పొందిన 18-26 సంవత్సరాల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.