News February 24, 2025

సేవాలాల్ మహారాజ్ వార్షికోత్సవంలో పాల్గొన్న జాన్సన్ నాయక్

image

ఖానాపూర్‌ మండలంలోని సత్తనపల్లి గ్రామంలోని సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయ వార్షికోత్సవంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ జాన్సన్‌నాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయకమిటీ సభ్యులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఆయన వెంట ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరిక

image

జగిత్యాల జిల్లాలో మత్స్యకార సంఘాలకు రావాల్సిన వేట హక్కులను కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ మంత్రులకు లేఖ రాసిన ఆయన, ప్రభుత్వం తీసుకుంటున్న టెండర్ విధానం మత్స్యకారులను అణగదొక్కేలా ఉందన్నారు. వేట హక్కులు స్థానిక సంఘాలకే ఇవ్వాలని, లేకపోతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. మత్స్యకారుల జీవనాధారాన్ని కాపాడాలన్నారు.

News July 6, 2025

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

image

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

News July 6, 2025

అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.