News February 24, 2025
పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ) ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 24 సోమవారం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.
News September 15, 2025
MHBD: తప్పని గోస.. రైతు వేదిక వద్దకే సద్ది బువ్వ!

మహబూబాబాద్ రైతన్నలకు యూరియా కష్టాలు తప్పట్లేదు. మబ్బులోనే PACS సెంటర్లు, రైతు వేదికలకు చేరుకుంటున్నప్పటికీ టోకెన్లు, యూరియా బస్తాలు దొరక్క అరిగోస పడుతున్నారు. మరిపెడ మండలం తానంచర్లలోని రైతు వేదికలో యూరియా టోకెన్లు ఇస్తారనే సమాచారం అందుకున్న రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి ఉంటుందని ముందే గ్రహించిన రైతున్న సద్ది పెట్టుకొని వచ్చి అక్కడే భోజనం చేశాడు.
News September 15, 2025
జగిత్యాల: బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 11 మంది అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.