News February 24, 2025

ఖమ్మం: తలసేమియా చిన్నారులకు రక్తదానం

image

కారేపల్లి: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా చిన్నారులకు రక్తం అందించడానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు స్వచ్ఛంధంగా రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారుల జీవితాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News February 24, 2025

ఖమ్మం: పోక్సో కేసు నిందితుడు అరెస్ట్:సీఐ 

image

రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నాలుగు రోజులు కిందట నమోదైన పోక్సో కేసులో ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెంకు చెందిన వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News February 23, 2025

ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల వివరాలు

image

అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్తం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,236 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో ఒక సూపర్‌వైజర్‌తోపాటు 123 అంగన్వాడీ టీచర్‌, 603 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సెంటర్ల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుండడంతో టీచర్ల కొరత తీరనుంది.

News February 23, 2025

ఖమ్మం: వారం రోజులు వ్యవధిలో అత్తా, కోడలు మృతి

image

వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మద్దివారిగూడెంకు చెందిన వీరవెంకటమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 4రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తికాగా, అప్పటికే  క్యాన్సర్‌‌తో బాధపడుతున్న వీరవెంకటమ్మ కోడలు కృష్ణవేణి సైతం శనివారం మృతి చెందింది. వారం వ్యవధిలోనే అత్తాకోడళ్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

error: Content is protected !!