News February 24, 2025

పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ 

image

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.‌ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన గుకేశ్

image

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా క్రోయేషియాలో జరుగుతున్న సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్&బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గారు. ఫైనల్ రౌండ్లో USకు చెందిన వెస్లేపై విజయం సాధించారు. నిన్న ఐదో రౌండ్లో వరల్డ్ No.1 కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ 2 ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా ఓవరాల్ విన్నర్‌‌ను ప్రకటిస్తారు.

News July 5, 2025

పిట్లం: అత్తను హత్య చేసిన అల్లుడి రిమాండ్(UPDATE)

image

పంట డబ్బుల విషయంలో అత్త లక్ష్మిని హత్య చేసిన అల్లుడు బాగరాజును పిట్లం పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ రూరల్ CI రాజేశ్ వివరాలు.. జూలై 3న లక్ష్మీని బాగరాజు కత్తితో హత్య చేశాడు. నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా, హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం బాగరాజును జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.

News July 5, 2025

వనపర్తి: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేయండి: డీఈవో

image

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జులై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.