News February 24, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
Similar News
News February 24, 2025
HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.
News February 23, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు శంకర్పల్లి మండలంలో 37.8℃, మొయినాబాద్ 37.4, ఫరూఖ్ నగర్ 37.3, ఇబ్రహీంపట్నం 37.2, కేశంపేట 37.2, హయత్ నగర్ 37.1, సరూర్నగర్ 37.1, శేరిలింగంపల్లి 37, కొందుర్గ్ 36.9, షాబాద్ 36.6, తలకొండపల్లి 37, అబ్దుల్లాపూర్మెట్ 35.8, నందిగామ 35.8, చేవెళ్ల 35, రాజేంద్రనగర్ 36.1, శంషాబాద్ 35.5, బాలాపూర్ 35.6, కందుకూరు 36.2, మహేశ్వరం 35.5℃గా నమోదైంది.
News February 23, 2025
HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లేస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకాథాన్లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.