News February 24, 2025
నర్సింహులపేట: జ్యోతిష్యం పేరుతో మోసం!

జ్యోతిష్యం పేరుతో బాబా వేషంలో వచ్చిన వ్యక్తులు బంగారం కాజేసిన ఘటన పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సముద్రాల శోభ ఇంటికి ఇద్దరు బాబా వేషాధరణలో వచ్చిన వ్యక్తులు, మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా అంటూ మాటలు కలుపుతూ శోభపై మొత్తం ముందు చల్లారు. శోభ ధరించిన బంగారాన్ని కాజేశారు. ఫోటో ఆధారంగా శోభ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News February 24, 2025
3 పతకాలతో సత్తాచాటిన పవర్ లిఫ్టర్ చంద్రిక

ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సీనియర్ నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక 84 కేజీల విభాగంలో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన చంద్రికను ఆమె కోచ్ నరేంద్ర రాజుని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ వంశీకష్ణ, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభినందించారు.
News February 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మధిర లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 24, 2025
ఖమ్మం: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.