News February 24, 2025
స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News November 7, 2025
ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు రూ.3 కోట్లు విడుదల

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక అకడమిక్ లబ్ధిదారునికి మొత్తం రూ.3 కోట్లు విడుదల చేసింది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానంలో భాగంగా ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా పంపిణీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల 48 గ్రామాల రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది.
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.
News November 7, 2025
HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


