News February 24, 2025
జర్మనీ ఎన్నికల్లో సంచలనం

నిన్న జరిగిన దేశ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ అంగీకరించారు. ప్రతిపక్ష పార్టీ CDU చీఫ్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. CDU/CSU కూటమి ఘన విజయం సాధించనుందని ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కూటమి 28.5 ఓట్ల శాతంతో 208 సీట్లు దక్కించుకోనుంది. 20.7% ఓట్లతో AfD రెండో స్థానంలో నిలవగా అధికార SPD 16.5% ఓట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
Similar News
News February 24, 2025
అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

AP: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు హాజరయ్యారు. కాసేపట్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా రోజుల తర్వాత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
News February 24, 2025
కోహ్లీ రికార్డుకు ముడిపెడుతూ కేసీఆర్‌పై మంత్రి సెటైర్లు

TG: భారత క్రికెటర్ కోహ్లీ రికార్డుకు, BRS చీఫ్ కేసీఆర్‌కు ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర ట్వీట్ చేశారు. 14వేల పరుగులతో కోహ్లీ రికార్డు బద్దలు కొడితే.. ప్రతిపక్ష నేతగా 14 నెలల్లో 14 రోజులు కూడా సభకు రాకుండా KCR రికార్డు నెలకొల్పారని సెటైర్లు వేశారు. పరుగులతో విరాట్ వార్తల్లో నిలిస్తే 14 నెలలుగా విరాట పర్వం వీడని గులాబీ బాస్ వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు.
News February 24, 2025
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 74,768 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 156 పాయింట్లు తగ్గి 22,639 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీలు HCL, టెక్ మహీంద్రా, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, సుజుకీ, బజాజ్ ఫిన్ లాభాల్లో దూసుకుపోతున్నాయి.