News February 24, 2025

రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

image

TG: లైఫ్ సైన్సెస్‌లోని పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 22వ బయో ఏషియా సదస్సు రేపు, ఎల్లుండి HYDలోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. దీనికి 50 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్రమంత్రి పీయూశ్ గోయల్, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్, ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ సహా పలు ఫార్మా కంపెనీల ఛైర్మన్లు ప్రసంగిస్తారు.

Similar News

News February 24, 2025

ఆ ‘నవ్వు’ ఆగి నాలుగేళ్లు అయింది!!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఒకప్పటి రెగ్యులర్ టాపిక్ మనకు ఇప్పుడు మరుగున పడింది. కానీ అక్కడి రణభూమి రగులుతూనే ఉంది. నేటితో మూడేళ్లు పూర్తైన ఈ యుద్ధంతో వేల మంది సైనికులు చనిపోయారు, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మిలియన్ల మంది రేపు అనేది ఏమిటో తెలియక ఇతర దేశాల్లో శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. ప్రతి గడియ గండంగా గడుపుతున్న ఆ దేశాల వాసులు నవ్వి నాలుగేళ్లు. ఈ నెత్తుటి క్రీడ ఆగేది, ఆరేది ఎప్పుడో?

News February 24, 2025

CM రిలీఫ్ ఫండ్ కోసం కావాల్సినవి!

image

ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏయే సర్టిఫికెట్లు కావాలో చాలా మందికి తెలియదు. దీనికోసం ఫైనల్ బిల్స్, ఎసెన్షియల్ సర్టిఫికెట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఇన్ పేషెంట్ బిల్, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్, ఆధార్ కార్డు& బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ & రేషన్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు కావాలి. వీటిని స్థానిక MLAకు అందించాలి. SHARE IT

News February 24, 2025

వారికి క్షమాపణలు చెప్పిన ‘ఛావా’ డైరెక్టర్

image

‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులు గనోజీ, కన్హాజీ షిర్కేను అవమానించారనే వారసుల ఆరోపణలపై దర్శకుడు లక్ష్మణ్ ఉటెకర్ స్పందించారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. అంతకుముందు సినిమాలో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తామని షిర్కే వారసులు దర్శకుడిని హెచ్చరించారు. మరోవైపు ఛావా థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

error: Content is protected !!